జమ్మికుంట మున్సిపాలిటీ లో మరో ముసలం మొదలయ్యింది.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 13

మొన్నటిదాకా అవిశ్వాసం,భారాసా కౌన్సిలర్ల రాజీనామాతో ఆసక్తికరంగా మారిన రాజకీయం తాజాగా మున్సిపల్ చైర్మెన్ గా ఉన్న వ్యక్తి మమ్మల్ని దూషణకు దిగాడని కౌన్సిలర్లు ఆరోపించారు.
కౌన్సిలర్ రాజు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిన్న రాత్రి పది గంటల సమయంలో మా సోదరుని కుమారుని వివాహనికి హాజరై బయటికి వస్తున్న తరుణంలో జమ్మికుంట మున్విపల్ చైర్మెన్ రాజేశ్వర్ రావు నా పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు, పురుష పదజాలంతో బ్రోకర్ పనికి పాల్పడ్డావని అన్నారన్నారు.అవిశ్వాస కార్యక్రమ సమయంలో తమకు సహకరించలేదని అసహనంతో నాతో గొడవకు దిగాడని అవేదన వ్యక్తం చేశారు.గౌరవ కౌన్సిలర్ అని కూడా చూడకుండా దుర్భశలాడాడు.కొట్టడానికి ప్రయత్నం చేశాడని చెప్పారు.స్ధానిక పోలీస్ స్టేషన్ లో ఛైర్మన్ పై ఫిరాధు చేశానని తెలిపారు.30 మంది కౌన్సిలర్లు భిక్షం వేస్తే ఛైర్మన్ అయ్యావు,ఛైర్మన్ గా ఉన్న సమయంలో కౌన్సిలర్ల స్వేచ్ఛను హరించావని అనారు.మా స్వంత నిర్ణయంతో నిన్ను ఇంత కాలం చైర్మెన్ గా సహకరించం. ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తున్నాం,గౌరవాన్ని కాపాడుకోని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండని హెచ్చరించారు.
అనంతరం కౌన్సిలర్ పోనగంటి మల్లయ్య మాట్లాడుతూ..
ఓ ప్రయివేట్ ఫంక్షన్ కు హాజరై బయటికి వస్తున్న తరుణంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు కౌన్సిలర్ రాజకుమార్ పట్ల జరిగిన దాడిని మేము ఖండిస్తున్నామని అన్నారు.బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి,4 సంవత్సరలు చేసిన అవినీతి బయటికి వస్తుందని భయపడి ఇలా గొడవకు దిగుతున్నారని అన్నారు. ఛైర్మన్ గా బిఅరెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిబ్బందికి,కౌన్సిలర్ల కు సరైన గౌరవం ఇవ్వలేదు.చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి తప్ప,మెజారిటీ సభ్యులు అవిశ్వాసం పెడితే వారిని దూషించడం పద్ధతి కాదన్నారు.
ఆరోపణ చేయడం కాదు, నిరూపణ చేయాలి.ఇది కేసిఆర్ ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏక చక్రదిపత్యం వహించి కౌన్సిలర్ లను అనేక ఇబ్బందులకు గురిచేశారు.సర్వే నంబర్ 629 ప్రభుత్వ భూమిలో 59 జీవో కింద ఛైర్మెన్ తన బినామిలకు భూములను కట్టబెట్టారు, మున్సిపల్ లో,పట్టణంలో జరిగిన అవినీతి పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking