మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు.
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 13
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని అలాంటి వారికి భయపడే ప్రసక్తి లేదని అన్నారు. మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తనకు తారసపడిన కౌన్సిలర్ రాజు తనను అవహేళన చేశాడని పద్ధతి మార్చుకోవాలని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తనపై పెట్టిన అవిశ్వాసం సమయంలో ఐదు లక్షల రూపాయలు కౌన్సిలర్ రాజు తీసుకున్నాడని ఆరోపించారు. తాను అవినీతి చేశానని పదేపదే చెప్పుకుంటున్న కౌన్సిలర్లు దమ్ముంటే బయటికి రావాలని సవాలు విసిరారు. ఈ సమావేశంలో పి ఎస్ సి ఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్ మున్సిపల్ కౌన్సిలర్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.