ఏసిపి చేతుల మీదుగా యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ సిడి ఆవిష్కరణ…!

 

– సాహితి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించిన ఏసిపి శ్రీనివాస్ జి-

-మాదకద్రవ్యాల నిర్ములనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 8

సాహితి ఫౌండేషన్ చైర్మన్ రాముల కుమార్ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పాటల సీడీని హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ, చేతుల మీదుగా ఫౌండేషన్ కోఆర్డినేటర్లు కొండం శ్రీధర్ రెడ్డి, మహమ్మద్ అంకుస్, ఆధ్వర్యంలో ప్రముఖ కవి గాయకుడు రచయిత మేకల నవీన్ కుమార్ రాసి పాడిన “భరతమాత ముద్దుబిడ్డ లారా దేశాన్ని కాపాడే పౌరులారా ” అనే పాటల సిడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాహితీ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ఎసిపి శ్రీనివాస్ జి అభినందించారు భవిష్యత్తులో సమాజ చైతన్యం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తమ వంతుగా సహకారం అందిస్తామని ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీక్ , నవీన్, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking