కమీషనరేట్ పరిధిలోని విధ్యార్థిని విధ్యార్థులకు, యువతకు ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం
పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08 : శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు“పోలీస్ ఫ్లాగ్ డే”సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ,షార్ట్ ఫిలిం తీయడానికి రామగుండము పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలో ఆసక్తి గల యువతక ఔత్సహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు,పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే తీసిన (3)ఫోటోలు,తక్కువ నిడివి(3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20 వ తేదీ సాయంత్రంలోగా కమీషనరేట్ పోలీస్ కార్యాలయంలో ఎన్ ఐ ఆర్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లేదా పోలీస్ పిఆర్వో కి అందజేయాలన్నారు.ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదు,10 x 8 సైజ్,ఫోటోలను,షార్ట్ ఫిలింను పెన్ డ్రైవ్ లో మీ యెక్క పూర్తి వివరాలతో అందజేయలని, కమీషనరేట్ స్థాయిలో సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలింలను,ఫొటోలను రాష్ట్ర స్థాయి పోటీల గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాదుకు పంపించడం జరుగుతుందన్నారు.మరిన్ని వివరాల కోసం, 8712656596,8712656587 నెంబర్ల ద్వారా సంప్రదించాలన్నారు.