విజ్ఞప్తులు సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 26:

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య
అధికారులను ఆదేశించారు.
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదీదారులతో మమేకమై వారి సమస్యలను సావధానంగా పరిశీలించి పరిష్కార దిశగా కృషి చేయాలని, నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. పరిష్కరించుటకు వీలులేని పక్షంలో తదుపరి చర్యల కోసం వారికి అర్ధమయ్యే విధంగా సూచనలు అందించాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఫిర్యాదుదారుల నుండి 60 విజ్ఞప్తులను అదనపు కలెక్టర్ డిఆర్డిఏ పిడి కౌసల్యాదేవి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓ కృష్ణ వేణి లతో కలిసి స్వీకరించారు. అందులో 28 రెవెన్యూ శాఖకు, 4 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, 3
డి సి ఎస్ ఓ, 3 డిపిఓ, 2 డిఆర్డిఓ, 3 వ్యవసాయ శాఖ, 4వైద్య ఆరోగ్య శాఖ, 4 జిల్లా ఉపాధి కార్యాలయం, 2 డి డబ్ల్యు,ఓ, ఎటునాగారం ఐటిడిఏ, ఎల్డీఎం, డి సి ఓ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఆరోగ్య శ్రీ, జిల్లా పరిశ్రమల శాఖలకు ఒకటి చొప్పున దరఖాస్తు వచ్చాయి. ఈ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ ప్రజావాణి లో జిల్లా పంచాయతీ అధికారి కల్పన, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, సంబంధిత, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking