ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..సోమవారం నిర్మల్ జిల్లాలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిక్షరించాలను సూచించారు. ఇప్పటి వరకు శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అర్జీల పై చర్చించారు. వేసవి కాలం నేపథ్యం లో గ్రామాలలో త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్నుల బకాయిలు వెంటనే చెల్లించాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ, ధరణి, పింఛన్లు, భూసంబంధిత వంటి సమస్యలకు 39 అర్జీలు వచ్చాయని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీలను వెంటనే పరిష్కరించవల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఓ గంగయ్య, డి.ఆర్.డి.ఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు