వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 26:
వరంగల్ జిల్లా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నూతన కార్యవర్గం సోమవారం ఎనికాయ్యింది. ఎసిపిఎస్ కన్వీనర్ దేవ అరవింద్ బాబు అధ్యక్షతన స్థానిక ఏవివి కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎసిపిఎస్ జాతీయ అధ్యక్షులు, ఫౌండర్ గందె ప్రేమ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు బొద్దుకూరి కిరణ్ కుమార్లు, హాజరై ఎన్నికైన నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా చందా జగదీశ్వర్, కార్యదర్శిగా గదే వాసుదేవ్, కోశాధికారిగా సిహెచ్ నాగరాజు,ల తో పాటు మిగతా కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గం ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఏసీపిఎస్ తరపున అలుపెరుగని పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టి మల్ల శ్రీనివాస్ రావు, జిల్లా గౌరవ అధ్యక్షులు భువనగిరి రాజన్న, సంయుక్త కార్యదర్శి వి నూతన కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రమేష్, గుండా రాము, దార పూర్ణ, కార్యదర్శిలు వాసుదేవ్, వెంకటేశ్వర్లు, రమేష్, ముఖ్య సలహాదారులు గుండ ప్రభాకర్ గుప్తా, సంతోష్ కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు యేలగందుల రాజు, ఎ సి పి ఎస్ సభ్యులు పాల్గొన్నారు.