కే జీ బీ వి లలో గల 32 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..జిల్లాలోని కే జీ బీ వి లలో గల వివిధ నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలకు మండలాల వారీగా దరఖాస్థులు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధీకారి డా. ఏ. రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయా మండలాల పరిధిలోని కే జీ బీ వి లలో గల వంట మనిషి.సహాయ వంట మనిషి, స్వీపర్.స్కావెంజర్, ఆఫీస్ సుబార్డినెట్.అటెండర్,
డే.నైట్ వాచ్ విమెన్ (నాన్ టీచింగ్) పోస్టుల ఖాళీలకు,ఆయా మండలాలకు చెందిన, పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు అని,అట్టి అభ్యర్థులు ఆ మండలంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులకు ఆగస్ట్ 31 చివరి తేదీ అని ఆయన సూచించారు.
మండలాల వారీ వివిధ నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీల వివరాలు ఆయా మండలాల విద్యాశాఖ కార్యాలయం నోటీస్ బోర్డ్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పూర్తి వివరాలలకు ఆయా మండలవిద్యాశాఖ కార్యాలయంను సంప్రదించి,అర్హులైన అభ్యర్థులు ఆగస్ట్ 31 వ తేదీ లోగా ఆయా మండల విద్యా శాఖ కార్యాలయం లో, మండల మీ విద్యాధీకారి వద్ద మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని,జిల్లా విద్యాశాఖ కార్యాలయం నకు రాకూడదని ఆయన తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking