బాసర ఐ ఐ ఐ టి కార్మికుల జులై నెల పెండింగ్ జీతాలు, 2021 సంవత్సరం నుండి వి డి ఏ డబ్బులు వెంటనే విడుదల చేయాలని సి ఐ టి యు ధర్నా
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..బాసర ఐ ఐ ఐ టి యూనియన్ సి ఐ టి యు ఆధ్వర్యంలో బాసర త్రిబుల్ ఐటీ గేటు ముందర గంట పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెనసురేష్ మాట్లాడుతూ బాసర త్రిబుల్ ఐటీ కార్మికులకు పదివేలు 10800 రూపాయలు జీతమే తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత బేసిక్ సాలరీ జి ఓ 60, ప్రకారము కార్మికులకు అమలు చేయాలని గత బి ఆర్ ఎస్. ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది,కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులకు కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయాలి,కావున బాసర త్రిబుల్ ఐటీ లో పని చేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులకు 16500 వేత్తనాలు అమలు చేయాలి.ఇప్పుడు కార్మికులకు చేతికి 10800,వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.పి ఎఫ్ 1200,ఈ ఎస్ ఐ200 కట్ అవుతుంది,మొత్తం జీతం 12200 కాంట్రాక్టర్ కార్మికులకు నెల జీతం ఇస్తున్నారు.కార్మికుల శ్రమ దోపి చేస్తున్నారు కావున వారికి రావలసిన మొత్తం పూర్తి జీతం వెంటనే కార్మికులకు అందే విధంగా ఉన్నతాధికారులు చొరువా చూపాలి కావున.జి ఓ 60 ప్రకారం 16,500 కార్మికులకు నెల జీతం అమలు చేయాలి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.
ఈ దేశంలో,రాష్ట్రంలో కార్మికుల కుటుంబాలు జీవన ఉపాధి కొనసాగించాలంటే పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వారి యొక్క నెలసరి జీతం బేసిక్ శాలరీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనం 26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాసర త్రిబుల్ ఐటీ ఆధ్వర్యంలో కార్మికులకు,ఐ డి.కార్డ్ ఇవ్వాలి,యూనిఫామ్ ఇవ్వాలి.సెలవులతో కూడిన వేతనం ఇవ్వాలి త్రిబుల్ ఐటీ కార్మికులను రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ భద్రత కల్పించాలి.బిజేపి ప్రభుత్వము తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లు చట్టాలను రద్దు చేయాలి.జులై నెల పెండింగ్ జీతం వెంటనే విడుదల చేయాలని, 3సంవత్సరాల నుండి వి డి ఏ డబ్బులు చెల్లించడం లేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం బాసర త్రిబుల్ ఐటీ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి కార్మికులకు కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమంకు, కార్మికుల హక్కుల కోసం సమ్మె చేయడానికి కూడా వెనుకనం అనేది అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.ఈ సమస్య పరిష్కరించకుంటే సెప్టెంబర్ నెల 9వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం.ఈ కార్యక్రమంలో
అధ్యక్షులు టీ.ఫిరాజి
.ప్రధాన కార్యదర్శి సాయిలు.
ఉపాధ్యక్షులు లింగన్న,రెంజర్ల భారతి, దయానందు,సిద్దు సాయిలు,సహాయ కార్యదర్శి,ప్రేమల గోదావరి, శారదమ్మ,కోశాధికారి లలితబాయి.కమిటీ సభ్యులు. రుక్మాబాయి,శారదమ్మ, గంగన్న,గోదావరి, కవిత,సాయవ్వ శ్యామల,దేవవ్వ, లక్ష్మి,దారంపూరి. రాజు,జమిల్,నాసర్ ఖాన్,భోజన,మోహన్, గంగామణి,సాయమ్మ పోసాని పుష్ప, చంద్రకళ,మధుకర్, షకీల్,నాయకులు మురళి,
జె.రమేష్ యాదవ్