మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 19:
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటి ఫిర్యాదులను అప్పుడే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో 184 ఆర్జీలు వచ్చాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో డి. ఆర్. ఓ. హరిప్రియ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.