తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే కేశవరావు నియామకం

హైదరాబాద్ ప్రజా బలం ప్రతినిధి 06 జూలై 2024:
కే. కేశవరావును రాష్ట్ర సలహాదారుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ ఎఫైర్స్‌కు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తారని, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కాగా ఇటీవల బీ.ఆర్.ఎస్‌ ను వీడి కేశవరావు కాంగ్రెస్‌లో చేరారు, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కడ్‌ను కలిసి స్వయంగా రాజీనామా లేఖ అందించి తన రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒకపార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేసినట్టు కేశవ్ రావు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking