బాబు జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి ఫోరమ్ పర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో

 

సంగారెడ్డి జులై 6 ప్రజ బలం ప్రతినిది: డి అశోక్.
బాబు జగ్జీవన్ రామ్ 38 వ వర్ధంతి సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకుల నివాళులు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడిన సంఘ సంస్కర్త ,స్వాతంత్ర సమరయోధులు, భారత దేశ మాజీ ఊపా ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 38 వ వర్ధంతి సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ పోరాట స్ఫూర్తి తో సామజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు అణగారిన వర్గాల అభ్యున్నతికి మరియు సంక్షేమం కొరకు బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జాద్ ఖాన్,ప్రధాన కార్యదర్శి అమిది పురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి శ్రీకాంత్, పాండు రంగం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking