ప్రాన్స్ ఎన్నికలలో చేతులు మారనున్న అధికారం !  ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర జోశ్యం

 

2017 నుండి అప్రతిహాతం గా సాగుతున్న ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధికారానికి బీటలు

గత పరాజయాన్ని శాసిస్తూ అధికార అందలాన్నిఅందుకోబోతున్న నేషనల్ ర్యాలీ పార్టీ అధినేత మెరైన్ లే పెన్

పోరాడి ఓడుతూ ౩వ స్ధానానికై పోటీ పడనున్న ఫ్రాన్స్ ఇన్సౌమిస్ పార్టీ,సోషలిస్ట్ పార్టీ,గ్రీన్ పార్టీలు.

రానున్న రోజులలో దారుణమైన ఆర్ధిక మాంద్యాన్ని రుచి చుడనున్న యూరప్ లో నున్న దేశాలు

ప్రభావితం కానున్న అమెరికా, కెనడా జిడిపి లు

శక్తివంతమైన ఆర్ధిక దేశంగా మారనున్న భారత్,పెరగనున్న భారతదేశ జిడిపి
భారత్ లో పలురంగాలలో పెరగనున్న ఎగుమతులు.

గత కొంత కాలంగా రాష్ట్రీయ,జాతీయ,అంతర్జాతీయ రాజకీయాల గురించి,సినిమా గెలుపోటముల గురించి,పకృతి విపత్తుల గురించి తన అమోఘమైన జ్యోతీష శాస్త్ర మేధస్సుతో దాదాపు ౩౦౦ లకు పైగా ఖశ్చితమైన ప్రెడిక్షన్స్ చేసి ఫలితాలను పొందిన ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర ఈ సారి ప్రాన్స్ లో
జరగ బోయే ఎన్నికల ఫలితాల గురించి సంచలనమైన ప్రెడిక్షన్స్ చేస్తూ ఈ క్రింది విధం గా చెప్పారు.

ప్రస్తుతం ప్రాన్స్ లో రానున్న ఎన్నికల ఫలితాలు రానున్న రోజులలో అమెరికా,చైనాల తోపాటుగా యూరప్ లోని అనేక దేశాలపై దారుణమైన ప్రభావం చూయించబోతున్నాయి.కొన్ని దేశాలలోని జేడీపీ
దారుణం గా పడిపోతే, మరికొన్ని దేశాలలో ఆకస్మిక యుద్ధాలకు కారణం కారణం కాబోతుంది.ప్రత్యేకించి రష్యా ఉక్రెయిన్ మీద మరోసారి విరుచుకుపడే ప్రమాదం ఉంది.అలాగే ఇజ్రాయిల్, పాలస్తీనా గొడవలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశమూ లేకపోలేదు.ఈ ఎన్నికలలో అనేక పార్టీలు అధికారానికై పోటీపడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కేవలం 2 పార్టీలమధ్యే ఉండబోతుంది.

ఇన్వెస్టర్ బ్యాంకర్ గా జీవితాన్ని మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చి,
లా రిపబ్లిక్ ఎన్ మార్చ్ (La République En Marche! (LREM) పార్టీ పెట్టిన సంవత్సరంలోనే అనగా 2017 ప్రాన్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికై అధికారాన్ని చేబట్టిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఒకవైపు, సుశిక్షుతురాలైన న్యాయవాది గా కీర్తి పొంది, అటుపిమ్మట తన తండ్రి నుండి రాజకీయాన్నివారసత్వంగా పుణికి పుచ్చుకొని దశాబ్దాల రాజకీయ అనుభవం తో పలు పదవులను అలంకరించి,అధ్యక్ష పీఠాన్ని పలు సార్లు తృటిలో కోల్పోయిన నేషనల్ ర్యాలీ పార్టీ RN అధినేత మెరైన్ లే పెన్ మరో వైపు వీరిద్దరిమధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది.

అయితే అంతిమంగా లా రిపబ్లిక్ ఎన్ మార్చ్ అధినేత ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మీద నేషనల్ ర్యాలీ పార్టీ RN అధినేత అయిన మెరైన్ లే పెన్, విజయాన్ని సాధించడం ద్వారా అధికారాన్ని చేపట్టబోతున్నారు.

ఇక భారత దేశం లో త్వరలో జరగబోయే ఎన్నికలలో ఇండియా కూటమి గతంతో పోలిస్తే మరింత పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆ వివరాల గురించి మరోసారి వివరం తెలుసుకుందాము.

గతం లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి భవిష్యవాణి చెబుతూ బి ఆర్ యస్ పార్టలో చివరకు 4 / 5 ఎం ఎల్ ఏ లు తప్ప ఎవరు మిగిలే అవకాశం లేదని చెప్పిన జోశ్యం లో ఎటువంటి మార్పులేదు.త్వరలో జరగ బోయే మంత్రి వర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి అనుంగ సహచరులలు,యువకులు అయిన తూర్పు తెలంగాణా నాయకులకు అవకాశం రానుంది.అంతేకాకుండా రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి విషయం లో తీసుకోబోయే అనేక నిర్ణయాలలో బడే భాయ్ నరేంద్ర మోడీ సహకారం పుష్కలంగా ఉండబోతుంది.రాజకీయంగా ఎవ్వరూ ఊహించని నిర్ణయాలు రేవంత్ రెడ్డి తీసుకోనున్నతరుణం లో ఒక పార్టి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది .
తెలంగాణ రాజకీయాలలో దశాబ్ధ కాలం పైగా చక్రం తిప్పిన ఒక పారిశ్రామిక దిగ్గజానికి తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
సమీప భవిష్యత్తులో హైదరాబాద్ ను యుటి గా మార్చే ఆలోచనలకూ నాంది పడవచ్చు.తెలంగాణలో ఎవ్వరూ ఊహించని విదంగా గత ప్రభుత్వపు భారీ భూస్కాములు బహిర్గతం కానున్నాయి.నల్గొండ జిల్లాకి చెందిన ఒక నాయకునికి ఎవరు ఊహించని రీతిలో “మంత్రి” వర్గంలో చోటు రాబోతుంది.ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకుడు మృత్యు గండ సూచనలు ఉన్నాయి.మరోసారి అరుణాచల ప్రదేశ్
వార్తలకెక్కుతుంది.చైనా నుండి ప్రమాద సూచనలున్నాయి.సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.నేపాల్ రాజకీయ ముఖచిత్రం లో ఊహించని సంఘటనలకు ఆస్కారం.ప్రభుత్వము మారే అవకాశం.దారుణంగా మారబోతున్న అండమాన్ ఆర్థిక పరిస్థితులు ,రాజకీయ అనిచ్చితి పరాకాష్టకి చేరును.మోడీ సర్కార్ నిర్ణయాలు సంచలనం సృష్టిస్థాయి, Crypto కరెన్సీలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.భారత్ క్రిప్టో డెబిట్ కార్డులు ప్రవేశించవచ్చు.దీని వలన మరికొంతమంది రోడ్డున పడే అవకాశం ఉంది.భారత్ లో గేమింగ్ కల్చర్ ఊపందుకుంటుంది.బెట్టింగ్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే అవకాశం ఉంది.పెరుగనున్న ఆన్‌లైన్ మోసాలు , మహిళలే టార్గెట్ గా విజృంభణ , హైదారాబాద్ వాసులకు జాగ్రత్త అవసరం.హైదరాబాదు కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వాడలో పలు అగ్ని ప్రమాదాలు సంభవం,రాత్రి పనిచేయు సిబ్బంది కి జాగ్రత్త అవసరం.గ్రానైట్ పరిశ్రమలు తిరోగమనంలో పయనిస్తాయి.వ్యాపారస్తులు రవాణా సంఘాలు పలు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు పలు వివాదాలతో తెరపైకి రానున్నా ప్రముఖ ఫార్మా రంగం.అరబిందో వారికి పొంచివున్న ప్రమాదం.రాజకీయ ఖైదీలతో కలకలలాడనున్న చర్లపల్లి , మరోసారి ఉద్యమాలతో వార్తల్లోకి తెలంగాణ.
ఊహించని విదంగా మొయినాబాద్,చేవెళ్ల ప్రాంతాల భూములకు రెక్కలు వస్తాయి.కారణం అంతుబట్టక ప్రజలు అయోమయం చెందుతారు. సాదరణ ప్రజల సొంత యింటి కల ఎండమావి గా మారే అవకాశం.
అమాంతం పెరగనున్న నిత్యావసర సరుకులు,మల్లికార్జున ఖర్గే,జగన్మోహన్ రెడ్డిల బంధం పలువురు రాజకీయ మేధావులకు ఆశ్చర్య పరచబోతుంది.జగన్ మోహన్ రెడ్డి తీసుకునే కొన్ని నిర్ణయాలు కూటమి నేతలకు తలనొప్పిగా మారవచ్చు.

ఈ మధ్యనే బ్రిటన్ లో జరిగిన ఎన్నికల గురించి మేము రిషి సునాక్ అపజయాన్ని పొందుతారని చెప్పిన భవిష్యవాణి మన ఛానెల్లోరావడం అది 100 కి 100% అక్షర సత్యం గా మారడం మన పాఠకులకు తెలిసిన అంశమే

Leave A Reply

Your email address will not be published.

Breaking