డిగ్రీ కళాశాలలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే కాంగ్రెస్ ధ్యేయం

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 06 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఉన్నతి కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపిడటమే కాంగ్రెస్ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నిర్మాణ దశలోనున్న జూనియర్ కళాశాల,హైస్కూల్ ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా ఆధ్వర్యంలో అధ్యాపకులు ఎమ్మెల్యేకు డిగ్రీ కళాశాలలో నెలకొన్న పలు సమస్యలను విన్నవించారు.ముఖ్యంగా డిగ్రీ కళాశాల ఉన్నతీకరణలో భాగంగా అన్ని వసతులతో మరో అంతస్తు నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులను కేటాయించినట్లు,వచ్చే సోమవారం నుంచి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే అక్కడిక్కడే ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1200 మందికి పైగా విద్యార్థులుండటం అభినందించదగిన విషయమని ప్రిన్సిపాల్ ను,అధ్యాపక బృందాన్ని ఎమ్మెల్యే మెచ్చుకున్నారు. అదే విధంగా విద్యార్థినుల సంఖ్యను మరింతగా పెంచడానికి కృషి చేయాలని, అవసరమైన హాస్టల్ ఇతర వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. విద్యార్థినిలు కళాశాలకు సమయానికి వచ్చి,పోయేలా ఆర్ టీ సీ బస్సును నడపాలని మంచిర్యాల డీ ఏం ను ఫోన్ లో ఎమ్మెల్యే ఆదేశించారు.వచ్చే ఏడాదికి 1500 మంది విద్యార్థులు కళాశాలలో ఉండేలా కృషి చేయాలని,ప్రభుత్వ కళాశాలను,సంస్థలను కాపాడటంలో అందరూ భాగస్వాములవ్వాలని కళాశాల సిబ్బందికి సూచించారు. అంతకముందు హిస్టరీ విభాగం అధిపతులు సల్ల శ్కాంట్రాక్టు లెక్చరర్స్, ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్స్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్స్ ఉద్యోగ భద్రత విషయంలో స్పష్టతను కలిగి ఉందని,త్వరలోనే సమస్యలు పరిష్కారిస్తామని ఎమ్మెల్యే వారికి హామీనిచ్చారు.డిగ్రీ కళాశాల ప్రవేశాల విషయంలో కీలకమైనటువంటి ఎన్ సీ సీ యూనిట్ మంజూరు కు కృషి చేస్తామని ఎమ్మెల్యే వివరించారు.జూనియర్ కళాశాల,హై స్కూల్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని సంబంధిత కాంట్రాక్టర్,అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం,జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరీఫ్,కౌన్సిలర్ రాందేని వెంకటేష్,సురేష్ నాయక్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్,వెంకటస్వామి గౌడ్,కొత్త వెంకటేశ్వర్లు,‌బియ్యాల తిరుపతి, రాజు,గోప రమేష్,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీ గంగయ్య,కళాశాల సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking