నామినేటేడ్ పదవులలో ముస్లీం మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలి

 

-జిల్లా కాంగ్రెస్ నాయకులు జిలానీ

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 24 (ప్రజాబలం)
ఖమ్మం జిల్లాలో ముస్లీం మైనార్టీలకు నామినేటేడ్
పదవులలో సముచిత స్థానం కల్పించాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ జిలానీ కోరారు.నిన్న మీడీయాతో మాట్లాడుతూ
ఖమ్మం జిల్లాలో 16 శాతం పైగా ఉన్న ముస్లీం మైనార్టీలలో 90 శాతం పైగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపారని వారిని దృష్టిలో పెట్టుకోని ఖమ్మం జిల్లా ముస్లీం మైనార్టీలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఖమ్మం గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఈ సారి కుడా మైనార్టీలకే దక్కాలని ఇతర రాష్ట్ర జిల్లా స్థాయి పోస్ట్ లలో సైతం ముస్లీం మైనార్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలన్నారు ఖమ్మం జిల్లాలో మైనార్టీలందరు కాంగ్రెస్ పార్టీకే మద్దతు గా నిలుస్తున్నారని బీఆర్ యస్ మైనార్టీలను మోసం చేసిందని ఈ సారి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక భూమిక షోషించిన మైనార్టీలకు అత్యదిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రాబోయో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దిని రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ముస్లీం మైనార్టీలాందరు సహాకరించాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking