కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 26 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కలెక్టర్ పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధరమ్ వీర్ జాఖర్ లతో కలిసి సర్దార్ పటేల్ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. సంబంధిత అధికారులు పర్యటన పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలన్నారు. వైద్యులు, అన్ని సదుపాయాల అంబులెన్స్, ఫైర్ ఇంజన్, కావాల్సిన వాహనాలు స్పెర్ తో సహా సిద్ధం చేయాలన్నారు. పటిష్ట కార్యాచరణ చేసి, అమలు చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సహా సన్నద్ధం అవ్వాలన్నారు.

ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అదనపు డిసిపి ఏ.సీ. బోస్, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. మాలతి, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking