ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముధోల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ముధోల్,-బాసర మండలాల ఆశా వర్కర్లు శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు రూ.18 వేలు అందజేయాలని, ప్రమాద బీమా, పీఎఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ మహమ్మద్ అథిక్ ఉద్దీన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్, బాసర మండల ఆశ వర్కర్లు విజయ లక్ష్మి, రాధ, ఇంద్ర, సుజాత, లత, సులోచన, అప్షరీ, సావిత, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking