ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సీనియర్ వైద్యులు డాక్టర్ జె. హరికిషన్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 26 (ప్రజాబలం) ఖమ్మం లోని కత్తుల వీరమ్మ స్మారక బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరికిషన్ మాట్లాడుతూ దోమలు కుట్టకుండా, అంటూ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు ఇటువంటి వ్యాధి లక్షణాలు ఉన్న వెంటనే ఖమ్మం లోని ఆయుర్వేద వైద్యశాలలో సంప్రదించాలని కోరారు అనంతరం విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులతో పాటు మమత మెడికల్ కళాశాల వైద్యులు కూడా పాల్గొన్నారు.