జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 30:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గ్రూప్ 4 పరీక్షల నిర్వహణ పై హైదరాబాదు నుండి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1 శనివారం రోజున నిర్వహించే గ్రూప్ ఫోర్ పరీక్షల నిర్వహణ,తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై కలెక్టర్లకు ఆయన పలు సూచనలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ల లో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో పాటు అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి ,జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాలొగొన్న జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జులై 1వ తేదీన జరిగే గ్రూప్–4 పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ విషయంలో టీఎస్పీఎస్సీ సూచనల ప్రకారం అధికారులు ముందుస్తు కార్యాచరణతో అన్ని రకాల పకడ్భందీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. జులై 1వ తేదీన జరగనున్న గ్రూప్–4 పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ నిబంధనలు, సూచనల ప్రకారం గతంలోనే సంబంధిత శాఖల అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించడంతో పాటు జిల్లా స్థాయి అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 56 రూట్స్ లో గ్రూప్–4 పరీక్షలకు సంబంధించి 187పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తుండగా అందులో 90,220 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలలో పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించామని దీని కోసం గతంలోనే అధికారులకు సూచించిన నేపథ్యంలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాలలో వికలాంగుల సౌకర్యార్థం వీల్ఛైర్లతో పాటు ర్యాంప్లు, మెట్లు అన్ని ఉండేలా అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో పాటు జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని పరీక్ష కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్స్తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామని వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని పరీక్ష కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులకు సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు, త్రాగునీరు, భద్రత తదితర అంశాలు ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారము తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గ్రూప్–4 పరీక్షలు రెండు సెషన్స్లో జరగనున్నందున ఎలాంటి పరిస్థితుల్లో పరీక్ష రోజున నిర్ణీత సమయం దాటిన తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వాచ్, సెల్ ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఉండటంతో పాటు అభ్యర్థులు హల్ టిక్కెట్తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును పాన్ కార్డు మినహ వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షకు ముందు ఓఎంఆర్ షీట్, హల్ టిక్కెట్పై బబ్లింగ్ గురించి అభ్యర్థుకు తెలియజేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలను టీఎస్పీఎస్సీ నియమ నిబంధనల ప్రకారం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తాము అని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపినారు.