రాజకీయాలకు అతీతంగా తెలంగాణ వికాస సమితి పని చేస్తుంది

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్

ఖమ్మం ప్రతినిధి జూన్ 30 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం తెలంగాణ వికాస సమితి ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా దార సత్యానందంను అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ వికాస సమితి పని చేస్తుంది అన్నారు . తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ శక్తులు వైపు తెలంగాణ ప్రజలు నిలబడాల్సిన అవసరం ఉందన్నారు . తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో పని చేసిన ఉద్యమ కారుల తో ఏర్పాటు అయిందే తెలంగాణ వికాస సమితి అన్నారు . ఎమ్మెల్సీ ప్రజా వాగ్గేయకారులు దేశపతి శ్రీనివాస్ అధ్యక్షులుగా తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కమిటీ కొనసాగుతుందని ఎర్రోజు వివరించారు . ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్నా ప్రజా ఉద్యమ సంస్థ తెలంగాణ వికాస సమితి అని పేర్కొన్నారు . ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ వికాస సమితి చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు . గత పది సంవత్సరాలుగా సంస్థ అధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు పై సమీక్ష చేస్తు ప్రజలకు మేలు జరిగే విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అన్నారు . ఈ సమావేశంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిండిగ వెంకన్న , ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దార సత్యానందం , ప్రధాన కార్యదర్శి కె. కోటేశ్వరరావు , ఉపాధ్యక్షులు రాజారావు , సంయుక్త కార్యదర్శి డి. రవీందర్ ,
మిద్దెల మల్లేశం గౌడ్ లు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking