పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి జూన్ 30 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి పొంగులేటి శ్రీనన్న కాంగ్రెస్ పార్టీలో చేరిక నేపథ్యంలో జూలై 2 వ తారీఖున జరిగే తెలంగాణ జనగర్జన మహాసభను జయప్రదం చేయవలసిందిగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఈరోజు పండితాపురం లో జరిగిన విలేకరుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చి ఆదుకుంటున్న జనహృదయనేత పొంగులేటి శ్రీనన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ పాలనను ను గద్దె దించాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నారని,, వారి సమక్షంలో పొంగులేటి శ్రీనన్న తో పాటు అభిమానులు, భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో. చేరుతున్నారని మల్లి బాబు యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని, చిన్నపాటి కార్యకర్త నుండి పెద్ద నాయకులకు ప్రాతినిధ్యం ఉంటుందని, ఇతర పార్టీలలో లాగా పక్షపాత ధోరణి ఉండదని, నిజమైన ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. పొంగులేటి శ్రీనన్న ఆదేశాల మేరకు కామేపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తల్ని కలుపుకొని జన సమీకరణ చేసి దాదాపు 15 వేల మందిని జనగర్జన సభకు తరలించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు భానోతు నరసింహ నాయక్, శీలం పుల్లయ్య, తొండల ముత్తయ్య, మేకల మహేష్ బాబు, బండి ఉపేందర్, పాటిబండ్ల ప్రసాద్, మొగిలి శ్రీను, దొడ్డ నాగేశ్వరరావు, బానోతు లక్ష్మానాయక్, తదితరులు పాల్గొన్నారు.