ఏపార్టీ టికెటిచ్చినా ఓట్లు వేయాల్సిందే
పాల్వంచ రామారావు
ఖమ్మం ప్రతినిధి జూన్ 30 (ప్రజాబలం) ఖమ్మం జెడ్పిమీటింగ్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ తోకలిసి తెలుగుదేశం నాయకుడు బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు పాల్వంచ రామారావు విలేకరులతో మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయటమే కానీ ఏదైనా పార్టీ బీసీలకు టికెటిస్తే మొఖం చాటేసుకొని తిరుగుతారని అందుకనే కొన్ని బీసీ సంఘాలను మొక్కుబడి సంఘాలుగానే ప్రజలు భావిస్తున్నారన్నారని ఆవేదన భరితంగా చెప్పారు అందుకనే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ బీఎస్పీ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఆఖరికి బీసీలకు తీరని ద్రోహం చేసిన బిఆర్ఎస్ పార్టీ బీసీ కులాలకు టిక్కెటిచ్చినా సరే ఓట్లువేసి గెలిపించుకోవాల్సిందిగా వేడుకున్నారు అందుకు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలతో పాటుగా ఓసి వర్గాలవారు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు బీసీ వర్గాలను ఏరాజకీయ పార్టీలు కనీసం పట్టించుకోకపోయినా స్వర్గీయ వీపీ సింగ్,స్వర్గీయ ఎన్టీ రామారావు బీసీ వర్గాలను ఆదరించి అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతగా జయంతి వేడుకలు జరపాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు నూతన బీసీ జేఏసీ అధ్యక్షుడు చిట్టోజు రమేష్ ప్రధాన కార్యదర్శి టీవీ రాజు బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ మధుగౌడ్ నాగరాజు యాదవ్ వెంకటాచారి తదితరులు పాల్గొని ప్రసంగించారు