జగిత్యాల రాజకీయ వాతావరణాన్ని పాడుచేయకు
నీకు రాజకీయ భిక్ష పెట్టింది బీఆర్ఏస్సే
నీకు ఓ నిక్ నేముతో మేము ప్రచారం చేయగలం
బోగ శ్రావణికి హితబోధ చేసిన డా.చంద్రశేఖర్ గౌడ్
జగిత్యాల ప్రతినిధి, జూన్ 30, (ప్రజా బలం) రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన బిజెపి నాయకురాలు శ్రావణి దశాబ్దాల జగిత్యాల రాజకీయ వాతావరణాన్ని వ్యక్తిగత దూషణలతో మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఈ పద్ధతి మార్చుకోవాలని జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ హితబోధ చేశారు. శుక్రవారం నాడు జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటివలె ఎమ్మెల్యే సంజయ్ పై బిజెపి నాయకురాలు బోగ శ్రావణి చేసిన ఆరోపణలపై బీఆర్ ఎస్ నాయకులు కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ సందర్భంగా డా.చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ జగిత్యాల రాజకీయ పరిసరాలు గత ముప్పది ఏండ్లకు పైగా గౌరవప్రదముగా ఉన్నాయన్నారు. కానీ ఇటీవలి కాలంలో బిజెపి నాయకుల మూలంగా ప్రజలకు జరగాల్సిన మేలుకంటే వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ వాతావరణం కలుషితమవుతోందన్నారు. ఇందులోనూ బిజెపి నాయకురాలు బోగ శ్రావణి కేవలం డా. సంజయ్ కుమార్ నే టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందన్నారు. ఇది సరియైన పద్ధతి కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రాజేశం గౌడ్, రమణ వంటి సీనియర్ నాయకులు ఏనాడు వ్యక్తిగత దూషణలు దిగలేదని ఇప్పుడు ఇదో అలవాటుగా మారిందని చంద్రశేఖర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అధికారపార్టీ తప్పిదాలను నిర్మాణాత్మక రీతిలో విమర్శలు చేయాలని అవికూడా సద్విమర్శలుగా ఉండాలన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెచ్చిన దరిద్రపు వ్యక్తిగత దూషణల అలవాటు ఇప్పుడు శ్రావణి అమలుచేస్తోందని ప్రతివిషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని డా. చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. పులకేసి అంటూ ఆరోపిస్తున్న శ్రావణి కి మెమో నికు నేము పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని కానీ మేమా రూట్లో పొదలుచుకోలేదని డా.చంద్రశేఖర్ గౌడ్ చెప్పారు. మా పార్టీ బిసిలకు అన్యాయం చేసిందని మాట్లాడుతున్న బోగ శ్రావణి కి రాజకీయ భిక్ష పెట్టింది బీఆర్ఎస్ అని మరిచిపోరాదన్నారు. వాస్తవానికి బిజెపి పార్టీ బి.సి.లకు చేసిమెదేమిటో చెప్పాలని చంద్రశేఖర్ గౌడ్ ప్రశ్నించారు. దేశ ప్రధాని మోడీ బిసి అయి కూడా బిసి కుల గణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వర్గంలో బిసి మంత్రిత్ర శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. శ్రావనికి బీసీలపై ప్రేమ ఉంటే కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని బిసిల సమస్యలపై నిలదీయాలని డా. చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పతకాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వమే పేర్లు మార్చి అమలుచేస్తోందన్నారు. ఇంతకీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పతకాలను ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇప్పుడే అడుగుపెట్టిన బోగ శ్రావణి స్థానిక రాజకీయాన్ని వ్యక్తిగత దూషణలతో కలుషితం చేయడం మానుకోవాలని డా. చంద్రశేఖర్ గౌడ్ హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ ఎస్ నాయకులు బాల ముకుందం, బీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్ష, కార్యదర్శులు కచ్చు లత, శ్రీమంజరి, అర్బన్ మండల సర్పంచుల ఫోరమ్ అద్యక్షులు గంగాధర్, గుల్లపేట, జాభితాపూర్, వంజరిపల్లి, గొల్లపల్లి సర్పంచులు తిరుపతి, సతీష్, గంగారాం, ప్రకాష్ తోపాటు పోరుండ్ల ఎంపిటిసి తిరుపతి, అడువాల లక్ష్మణ్ లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై శ్రావణి చేసిన ఆరోపణలను ఖండించారు.