పోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ చెయ్యాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 24 : మంచిర్యాల జిల్లా మంచిర్యాలలోని నివాసంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ప్రెస్ మీట్ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాదిగ హక్కుల దండోరా నాయకుడు రేగుంట సునీల్ మాదిగ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి మద్దతు ప్రకటించిన మాదిగ హక్కుల దండోరా నాయకులు, రేగుంట సునీల్ మాదిగ మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బిజెపి దళితులకు వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్ లో నిషేదించాలని గతంలో డిమాండ్ చేశారు.బిజెపి మళ్లీ అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం తోనే దళితులకు హక్కులు కల్పించబడ్డాయి బిజెపి రాజ్యాంగాన్ని మారిస్తే మళ్లీ వెనకటి పరిస్థితి, పునరావృతం అవుతుంది.బిజెపి బిఆర్ఎస్ దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలకు పొందాలని చూస్తున్నాయి కానీ ఎన్నికల్లో మాదిగల మద్దతు కాంగ్రెస్ కే మందమరి లోనే లెదర్ పార్కును పూర్తిచేస్తే వేల మంది దళితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి లెదర్ పార్క్ పూర్తి కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట ఇచ్చారు. అంతేకాకుండా మాదిగల ఆత్మగౌరవాన్ని చాటేలో గౌరవ అంబేద్కర్ భవనాలు నిర్మిస్తామన్నారు.గడ్డం వంశీ కృష్ణ మంచి విజన్ ఉన్న నాయకుడు ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చారు.ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించడానికి మాటికలంతా సిద్ధంగా ఉన్నారు.అనంతరం ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ…పెద్దపల్లి ఎంపీ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది,నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలంతా ఐక మత్యంతో ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజారిటీ సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.బీఆర్ఎస్ పై విసిగి పోయిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్,కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి.దేశ భద్రత కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు.నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు.దిగజారిపోయిన బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటి లు అమలు చేస్తున్నాం. ఎన్నికల తరువాత ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు రూ.2500 అందిస్తాం.పంద్రాగస్టు లోపం రైతులకు రుణమాఫీ చేస్తాం దీనిపై బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చిస్తోంది, తెలంగాణలో వారు వనసైడు అన్నట్టు ఉంది రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం,బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది.రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ కూడా పూర్తిగా ఇవ్వట్లేదు.కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగేదిమే లేదు.మాకు పదవులు ఉన్నా, లేకున్నా నిత్యం ప్రజల మధ్యనే ఉన్నాం.సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మండమర్రి లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం,చెన్నూర్ లో త్వరలోనే ఏర్పాటు చేస్తాం.సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటు చేస్తాం.జైపూర్ పవర్ ప్లాంట్ లో 800 మెగావాట్ల యూనిట్ ఏర్పాటు చేస్తాం.80 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తాం.మందమర్రి లో లెదర్ పార్క్ ను త్వరలోనే ప్రారంభిస్తాం.మాదిగలకు కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం. ఇంత కన్నా ముందు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ…పెద్దపల్లి నియోజకవర్గంలో కాక కుటుంబానికి 60 ఏళ్లకు పైగా అనుమానం ఉంది.కాకా వెంకటస్వామి సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు 450 కోట్ల లోన్ ఇప్పించి శాఖలో ఉన్న లక్ష ఉద్యోగులను కాపాడారు.జైపూర్ లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు,రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ పునరుద్ధరణకు కాకా కృషి చేశారు.పెన్షన్లు పి డి ఎస్ సిస్టం కాకా కృషి ఫలితమే, కార్మికుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కాకా వెంకటస్వామి,వివేక్ వెంకట స్వామి,వినోద్ అండగా ఉన్నారు.బ్రిటిషర్ల విభజించు పాలించ సిద్ధాంతాన్ని బిజెపి బిఆర్ఎస్ తెలంగాణలో ఫాలో అవుతున్నాయి.దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి కుట్ర చేస్తున్నాయి, కాకా కుటుంబం కులమతాలకు అతీతం.పేదలకు సేవ చేయడమే మా లక్ష్యం బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంది. దళితులను మోసం చేసింది.ఇండస్ట్రియల్ లిస్టు గా నా జీతం డబ్బులతో కంపెనీని స్థాపించి 500 మందికి ఉద్యోగాలు కల్పించాను. అందులో పెద్దపల్లి ప్రాంతానికి చెందిన యువకులే ఎక్కువమంది ఉన్నారు.బిజెపి,బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమిని అంగీకరించారు.అందుకే నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.కాకా కుటుంబానికి పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉన్నాము విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

       

Leave A Reply

Your email address will not be published.

Breaking