ఎస్‌ ఆర్‌నగర్‌ నారాయణ పాఠశాలలో గ్రాడ్యుయేషన్‌ డే ఘనంగా

సనత్‌నగర్‌ ప్రజాబలం ప్రతినిధి:ఎస్‌ ఆర్‌నగర్‌ నారాయణ పాఠశాలలో గ్రాడ్యుయేషన్‌ డే ఘనంగా నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ విద్యార్థులు యుకేజీ తరగతులు పూర్తి చేసుకుని ప్రాథమిక తరగతుల లో అడుగు పెడుతున్న సందర్భం గా వారికి సర్టిఫికెట్స్‌ ఇచ్చి విద్యార్థులను ప్రోత్సాహించారు.అలాగే ఈ చాంప్స్‌ విద్యార్థులు వారి యొక్క ప్రాథమిక తరగతులు పూర్తి చేసుకుని ఉన్నత పాఠశాల లో అడుగు పెడుతున్న సందర్భంగా వారికి కూడా సర్టిఫికెట్స్‌ ఇచ్చి ప్రోత్సాహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎ జి యం శ్రీనివాస రెడ్డి,ఆర్‌ %డ% డీ శర్వాణి రెడ్డి,ప్రిన్సిపాల్‌ మెహరునీస పాల్గొని విద్యార్థుల కు సర్టిఫికెట్స్‌ ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో ఉన్నత చదువులను చదువుకొని గొప్ప స్థాయిలో ఎదిగి అందరికీ ఆదర్శప్రాయం గా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆట పాటలతో,నృత్యాలతో అందరిని ఆలరించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్‌ మెహరునీస, హైస్కూల్‌ కో ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌,ఈ చాంప్స్‌ కో ఆర్డినేటర్‌ ఫరాజనా,ఆర్‌ఐ మాధవ రెడ్డి,వైస్‌ ప్రిన్సిపాల్‌ అనిత,ఎ డి శ్రీకాంత్‌, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking