ప్రపంచ దేశాలను శాసించేది నరేంద్ర మోడీ.

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ల వీరేంద్ర గౌడ్.

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి ఏప్రిల్ 23

జమ్మికుంటలో నిర్వహించిన ఓబీసీ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న వీరేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మంచి పేరు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ అని వారి ఆశయాలతో ముందుకు నడుస్తూ తెలంగాణలో బిజెపిని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి బండి సంజయ్ కుమార్ అని అన్నారు. దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని కరీంనగర్లో రెండవసారి బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించడానికి కృషి చేయాలని అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన శిక్షణ తరగతులను తెలంగాణలో రాష్ట్రంలో కరీంనగర్ నుండే ప్రారంభించారని పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందం దివాకర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అగ్రవర్ణాల అభ్యర్థులకు దీటుగా బీసీ అభ్యర్థి అయిన బండి సంజయ్ ని రెండోసారి ఎంపీగా గెలిపించాలని బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్, సుధారాణి, ఆకుల రాజేందర్, కళ్యాణ్ గౌడ్, సతీష్ గౌడ్, కైలాసకోటి గణేష్, బూరుగుపల్లి రాము, బీసీ నాయకులు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking