మెదక్ జిల్ల తూప్రాన్ లో బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు
తూప్రాన్, సెప్టెంబర్, 13 ప్రజాబలం న్యూస్ :-
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంతో ఈ విషయమై పోలీస్ కమిషనర్ ను మాజీ మంత్రి హరీష్ రావు కలిసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రాత్రి కి రాత్రే వారిని స్వంత పుచికత పై విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం 11 గంటలకు కూకట్ పల్లి, వివేకానంద నగర్ కాలనీ లోని ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ నివాసంలో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కు పార్టీ పిలుపు నివ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నేతలను శుక్రవారం తెల్లవారు జామున సుమారు 4 గంటల నుండే మెదక్ జిల్ల తూప్రాన్ ఎస్ ఐ
జీ. శివానందం ఆధ్వర్యంలో ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై జరిగిన దాడి, అనంతరం జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బిఆర్ఎస్ కౌన్సిలర్ లను, ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. అరెస్టు అయిన వారిలో కౌన్సిలర్ లు బొంది వెంకట్ గౌడ్, భైరం సత్యలింగం, మామిడి వెంకటేష్, దూర్గారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ లు కత్తుల సత్యనారాయణ, రమేష్,జంగం రమేష్, బిఆర్ఎస్ తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు సరాఫ్ సతీష్ చారి, మైనార్టీ అధ్యక్షులు షేక్ భురాన్, ఉద్యమ నాయకులు మన్నె శ్రీనివాస్ రావు, వెంకటాయపల్లి గ్రామ కొంసానిమల్లారెడ్డి, కొంసాని శ్రీనివాస్ రెడ్డి, తొంట నర్సింలు, నక్కలపల్లి మల్లేష్, తీగుళ్ల భాను, తిగుళ్ల భాస్కర్, జంగం మల్లేష్, చిమల్దారి వెంకటేష్, కిష్టారం మహేష్, కిష్టారం లక్ష్మణ్, బామని మల్లేష్, చాకలి రాజు, బొడ్డు నాగరాజు తదితరులను ఎస్ ఐ శివానందం ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జానీ పాషా ,కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.