ప్రజాబలం – హవేలి ఘనపూర్ మండలం
13.09.2024:
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం శాలిపేట గేటు వద్ద అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దాసరి కిరణ్ కుమార్ వయస్సు (19) మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దాసరి కిరణ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి తో కలిసి అతిగా మద్యం సేవించి పల్సర్ బైక్ పై వేగంగా రావడంతో మెదక్ నుండి సర్దన వైపు వెళుతున్న క్రమంలో బైకును అతివేగంగా ఆజాగ్రత్తగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రోడ్డుపై పడి రాయికి గుద్దుకోవడంతో కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బాడీని మార్చరికి తరలించారు