మాజీ జడ్పిటిసి ముత్తె సత్తయ్య,పెద్దంపేట నక్క ముజ్జన్న
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం హాజిపూర్ మండలం పెదంపేట గ్రామానికి చెందిన నక్క ముజ్జన్న,తండ్రి రాజయ్య అనే వ్యక్తికి బలరావుపేట గ్రామశివారులో వ్యవసాయ భూమి ఉంది.అట్టి భూమికి ఆనుకొని మట్టిరోడ్డు ఉండగా అట్టి రోడ్డును ఆక్రమించి వరిసాగు చేసుకుంటుంనాడు. ఈయన భూమికి ఎదురుగా బెడద బసవయ్య భూమికుడా ఉండటంతో ఈయన కూడా కొంత మట్టి రోడ్డును ఆక్రమించి సాగుచేసుకుంటుండు. వీళ్ళు ఇద్దరు రోడ్డు ఆక్రమించి సాగుచేసుకోవడంతో అవతలి పొలాలకు రైతులు వెళ్లడం ఇబ్బందిగా ఉండటంతో అందరూ కలిసి ఎమ్ సీ కి పిర్యాదు చేయగా ఎమ్ సీ వచ్చి కొలతలు వేయగా ఇద్దరి పొలంలో హద్దురాళ్లు వేసి మట్టి రోడ్డును ఫిక్స్ చేసాడు. ఆతర్వాత గ్రామస్థుల కోరిక మేరకు ఎమ్ సీ చెప్పిన ప్రకారం బెడద బసవయ్య తన పొలంలో వేసిన హద్దు రాళ్ళ వరకు మట్టిరోడ్డుకు ఇవ్వడానికి అంగీకరించాడు.నక్క ముజ్జన్న మాత్రం ఇవ్వకపోగా ఇట్టి విషయం ఉత్తరం వైపు భూమి యజమాని అయిన అప్పటి జడ్పిటిసి ముత్తె సత్తయ్య కు చెప్పగా తను ముజ్జన్నను ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వకూడదని ఇస్తే మళ్ళీ భూమి రాదాని చెప్పడంతో పాటు అట్టి మట్టి రోడ్డుకు అడ్డంగా కరెంటు వైరు పెట్టి మోటార్ నుండి కనెక్షన్ ఇవ్వమని అటుగా వెళితే రైతులు చస్తారు కాబట్టి అటుగా వెళ్లారని తను జడ్పిటిసి కనుక నీకు ఎం కాకుండా నీవెనుక అండగా ఉంటానని ముత్తె సత్తయ్య సలహా ఇస్తూ ప్రోత్సహించగా ఇవ్వగా జులై 31వ తారీకు రాత్రి ముజ్జన్న అట్టి మట్టిరోడ్డుకు అడ్డంగా కొయ్యలు పాతి విద్యుత్ వైరు, జిఏ వైరుతో మోటార్ నుండి కరెంటు కనెక్షన్ పెట్టడం జరిగింది. విద్యుత్ షాక్ పెట్టి రైతులను చంపాలని చూసిన నక్క ముజ్జన్న, ముత్తె సత్తయ్య లను అదుపులోకి తీసుకొని Cr no.160/2024, సెక్షన్ 109, 49, BNS. ప్రకారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించడం జరిగింది.లక్షెట్టిపేట ఎస్సై పి సత్తీష్ తెలుపారు.