ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 03 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గద్దర్ అన్న జయంతి సందర్భంగా ఈ ఏడాది నుండి నంది అవార్డులుగా బదులు ప్రజా కవి గద్దర్ అవార్డుగా ప్రకటించడం పట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా కళాకారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ శ్రీ తంబూరి దయాకర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని కళాకారులను అభినందించారు గద్దర్ అన్న అవార్డులుగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులు గుడిపల్లి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి అరెంపుల సతీష్, సహాయ కార్యదర్శి కాలంగి లలిత, ఉపాధ్యక్షులు చేకూరి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు కొచ్చర్ల గురవయ్య, పుల్లయ్య, కర్ష, బొడ్డు నరేష్, డప్పు శివ, గురవయ్య, అనిల్, వెంకన్న, సతీష్, తదితర కళాకారులు, పలువూరు నాయకులు పాల్గొన్నారు