మహాలక్ష్మి పథకంలో భాగంగా దరఖాస్తులు సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా చూడాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 14 (ప్రజాబలం) ఖమ్మం
అర్హులైన లబ్ధిదారులకు మహాలక్ష్మి పధకంలో భాగంగా గ్యాస్‌ సిలిండర్‌ అందించేందుకు లబ్ధిదారుల దరఖాస్తుల సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ఆదేశించారు. బుధవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ, పౌర సరఫరాల అధికారులతో సమీక్షించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా డేటా ప్రకారం రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ ఏజెన్సీ, గ్యాస్ నెంబర్ నమోదు చేసి సరి చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, జిల్లా పౌర సరఫరాల అధికారి చందనకుమార్, మండల పంచాయతీ అధికారులు, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking