నియామక ఉత్తర్వులు అందుకునేందుకు హైదరాబాద్ కు వెళ్ళిన ట్రైనీ కానిస్టేబుళ్ళు

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 14
బుదవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక ఉత్తర్వులు అందుకునేందుకు ట్రైనీ కానిస్టేబుళ్ళు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముందు ట్రైనీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలియజేసి పచ్చ జెండా ఊపి ట్రైనీ కానిస్టేబుళ్లను బస్సుల్లో హైదరాబాద్ కు తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చట్టాన్ని పరిరక్షించే అధికారులుగా పోలీస్ శాఖలో అడిగిడుతున్నారు. నేటి నుండి మీకు క్రమశిక్షణ కూడా జీవితం ఆలపడుతుందని. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన 982 మంది అభ్యర్థులు వున్నారని. ఈ. ఇందులో సివిల్, ఏ. ఆర్, స్పెషల్ పోలీస్, ఎక్సైజ్, జైలు వార్దర్స్, పోలీస్ ఐటీ కమ్యూనికేషన్ లకు చెందిన వారు వున్నారని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. వరంగల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడంతో పాటు ప్రజలకు నిరంతరం సేవలందించాలని, విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్లు అశ్వనీ తానాజీ వాకిడి, రాధికాగుప్తా, టైనీ కలెక్టర్ శ్రద్దా శుక్ల, అదనపు డీసీపీ సంజీవ్, ఏసీపీలు సురేంద్ర,అనంతయ్య,ఆర్. ఐలు స్పర్జన్, శ్రీధర్ తో పాటు లైజనింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking