సేవ ద్వారానే జీవితానికి సంతృప్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య బైరం లింగన్నకు ఘనంగా సన్మానం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14 : సామజిక సేవలు జీవితానికి సంతృప్తినిస్తాయని,ఆ సేవలకు ప్రతిరూపమే బైరం లింగన్నఅని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య అన్నారు.బుధవారం లక్షెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ లో బైరం లింగన్న చేసిన సేవలను గుర్తించి హైదరాబాద్ లో జరిగిన డీజేఎఫ్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నందుకు గాను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ప్రజా, జర్నలిస్ట్ ల కోసం నిరంతరం పోరాటం చేయాలన్నారు. జీవితంలో సేవను చేయడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. జర్నలిస్ట్ లకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో గొల్ల కాంతయ్య, దొంత నరసయ్య, దేవి జగన్, గడిగొప్పుల కిష్టయ్య, పెరుగు తిరుపతి, సుంచు సతీష్, పెట్టాం సత్తయ్య,రావుల ప్రసాద్,దనిశెట్టి మల్లేష్, ముక్రం తదితరులు పాల్గొన్నారు.