విద్యావంతుడు తెలంగాణ ఉద్యమకారుడు ఉమా శంకర్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 14 (ప్రజాబలం) ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లుగా విద్యావంతుడు తెలంగాణ ఉద్యమకారుడు కోడిరెక్క ఉమా శంకర్ బరిలో నిలబడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బి.చందుపట్ల గ్రామంకి చేందిన కోడిరెక్క వెంకన్న- పద్మ దంపతుల కుమారుడు కోడిరెక్క ఉమా శంకర్ స్వస్థలం సూర్యాపేట జిల్లా అయినప్పటికీ జననం విద్యాభ్యాసం ఉద్యోగం ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు విద్యాభ్యాసం మరియు సమాజ సేవ ఎంఎస్సీ బిఎడ్ ఎంఎస్ డబ్ల్యు డబుల్ మాస్టర్ డిగ్రీల్లో పట్టా పొంది. గత 14 సంవత్సరాలుగా ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా అనుభవం ఉండటంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలతో ఉమా శంకర్ దూసు కపోతున్నారు గతంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ప్రైవేట్ అధ్యాపకుల లో మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులుగా పని చేస్తుండటం వలన రిజిస్టర్డ్ యువజన మహిళ సంఘాల మద్దతు ఉమా శంకర్ కె అంటున్నారు. సమాజ సేవలో భాగంగా తెలంగాణ గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ స్థాపించి యువతకు అవగాహన సదస్సులు ఉపాధి శిక్షణలు నిర్వహించినందుకు గాను కేంద్ర ప్రభుత్వ సంస్థ నెహ్రూ యువ కేంద్ర అధ్వర్యంలో 2022-2023 జిల్లా ఉత్తమ యువజన అవార్డును అందుకున్నారు. ఎన్.ఎస్.ఎస్ పి.ఓ గా ఎనిమిది సంవత్సరాలుగా పని చేస్తున్న ఉమాశంకర్ ఎన్నో సార్లు జిల్లా అధికారుల ప్రశంసలు అందుకున్నారు.
ఉద్యమ మరియు రాజకీయ ప్రస్థానం
2009 లో తెరాస అధినేత కేసీఆర్ ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్ నందు కధనబేరి నిర్వహించిన సమయంలో కేసీఆర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరి ఉద్యమంలో పాల్గొన్నారు. స్వతహాగా నాటి నల్లగొండ జిల్లా ప్రాంత వాస్తవ్యులు కావడం తన బాబాయ్ కోడిరెక్క మురళి అప్పటికే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవశ్యకతను గుర్తించి ఉద్యమంలో పని చేశారు. భవిష్యత్తుని సైతం పణంగా పెట్టీ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా తెరాస పార్టీకి ఎల్లప్పుడూ క్రమశిక్షణ గల కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కోడిరెక్క ఉమా శంకర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అవులూరి సౌమ్య రెడ్డి ని 2011 సంవత్సరంలో కులాంతర వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరుకుమారులు(కవలలు) ఇద్దరు చెల్లెళ్ళు తల్లి గృహిణి తండ్రి విశ్రాంత ఉద్యోగిఎన్నో ఏళ్లుగా అధ్యాపకునిగా పని చేస్తుండటం యువతలో మంచి పేరు ఉండటం సేవ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ నేపథ్యం, మూడు జిల్లాల్లో పట్టు సాధించే దిశగా పయనించడం కలిసి వచ్చే విషయాలు.యువత రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకే ఈ సారి ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్ధిగా మీ ముందుకు వస్తున్నానని నన్ను అశీర్వదించవలసినదిగా మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించవలసినదిగా ఈ సందర్భంగా కోరారు