మెదక్ ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం (ఎస్ ఎస్ సి స్పాట్ సెంటర్) ఏర్పాటు చేయాలని తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్ ఎస్ సి స్పాట్ సెంటర్ బిహెచ్ఇఎల్ పరిధిలోని జ్యోతి విద్యాలయంలో జరిగేది. ఇప్పటికీ మెదక్ జిల్లాలోని ఉపాధ్యాయులు బిహెచ్ఇఎల్ లోని జ్యోతి విద్యాలయానికి వెళ్లి మూల్యాంకన విధులు నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మెదక్ లో స్పాట్ సెంటర్ కోసం తపస్ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎస్ఎస్సి మూల్యాంకన కేంద్రం కూడా ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తపస్ మెదక్ జిల్లా శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం,చల్లా లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవరెడ్డి,దేవేందర్ రెడ్డి, మాకం రాజు ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
