మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ యుపిఎస్ కిష్టాపూర్ పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకొని హెడ్మాస్టర్ పట్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో విద్యాలయంలో విద్యార్థులకు స్కూల్ ఉపాధ్యాయ బృందంతో కలిసి ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ చదువుతున్న విద్యార్థులకు అమ్మవారి విశిష్టత గురించి విద్యార్థులకు చెప్పి అమ్మవారి చిత్రపటానికి పుష్పాలంకరణ హారతి ఇవ్వడం జరిగింది. అనంతరం నూతన పలకలు అందించి విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు.
అనంతరం స్కూల్ విద్యార్థులకు స్వీట్స్ పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రస్తుతమున సమాజంలో ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
