పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దండేపల్లి, లక్షెట్టిపేట,మండలం,మున్సిపల్ లో ఎన్నికల ప్రచార సభలు
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి,లక్షెట్టిపేట మండలం,లక్షెట్టిపేట పట్టణంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో చెన్నూర్ శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామ,పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు.కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ… పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలుపించాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా రాముడి పేరుతో దేశాన్ని ముక్కలు చేసే కుట్రలను బిజెపి పార్టీ చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని,అందులోని రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.బిజెపి పార్టీ ధనవంతుల పార్టీగా ఆయన అభివర్ణించారు.దళిత వర్గాలను అభివృద్ధి వైపు నడిపించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందని తెలిపారు.క్షేమం కోసం ఎన్నో చట్టాలను తీసుకువచ్చి సమాజ స్థాపనకు నాంది పలికామని అన్నారు.బిజెపి ప్రభుత్వం జాతి,మతాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు చేస్తుందని ఎద్దేవా చేశారు.మరోసారి బిజెపి పార్టీకి ఓటు వేస్తే దేశ సార్వభౌమాధికారానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. బిజెపి,బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేననడానికి నిదర్శనం పార్లమెంటులో బిజెపి పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బిఆర్ఎస్ పార్టీ సభ్యులు మద్దతు ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్,బిజెపి పార్టీలు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు వివరిస్తుందని తెలిపారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు.దళితులు, గిరిజనులు,మైనార్టీలు,పేద వర్గల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో దండేపల్లి , లక్షెట్టిపేట మండలం,మున్సిపల్ నాయకులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజలు పాల్గొంటున్నారు.