సోమవారం రోజున 11మంది అభ్యర్థులు నామినేషన్లు

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 22:
7- మల్కాజిగిరి
పార్లమెంట్ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ లో భాగంగా సోమవారం రోజున ( 11)మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పట్నం సునీత రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని ,రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ అభ్యర్థిగా అప్పారావు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా అంతోనీ డేవిడ్, పాలది పవన్ కుమార్, పెండ్యాల శేష సాయి వర ప్రసాద్,కంటే సాయన్న , బేగారి లోకేష్ ,భారత సుదర్శన్ నామినేషన్లు వేయగా, బిజెపి తరపున ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు,మహమ్మద్ అక్బర్ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking