ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఏప్రిల్ 22:జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పరిధిలోని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాత బృందాల సహాయంతో జిల్లాలో గల అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్వీప్ సిబ్బంది సమన్వయంతో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కళాజాత బృందాలు అన్ని అస్సెంబ్లీ నియోజకవర్గాల వారీగా గతంలో అత్యల్ప ఓటింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో గల స్వయం సహాయక సిబ్బంది, జిహెచ్‌ఎంసి సిబ్బంది మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తమ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జిల్లాలో ఓటింగ్ శాతం పెంపుదల యొక్క ఆవశ్యకతను వివిధ రూపాలలో తెలియపరచినారు. ఇట్టి సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక సారధి కళాజాత బృందంచే కూకట్పల్లి అస్సెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల నిజాంపేట్, బాలానగర్ ప్రాంతాలలో నిర్వహించడం జరిగినది. మరియు ఖుత్బుల్లాపూర్ అస్సెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి, సాంస్కృతిక సారధి కళాజాత బృందంచే డిప్యూటీ కమీషనర్ కార్యాలయము నందు వోటింగ్ శాతం పెంపుదల కొరకు అందరు Booth Level Officers తో ఓటింగ్ శాతం పెంపుదల కొరకు తీసుకొనవలసిన చర్యల గురించి చర్చించడం జరిగినది. మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి & స్వీప్ నోడల్ ఆఫీసర్ గారి అధ్వర్యంలో సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్, ఘట్కేసర్ విధ్యార్థిని విధ్యార్థునులకు ఓటు యొక్క ఆవశ్యకత మరియు ప్రతి యొక్క విధ్యార్థిని విధ్యార్థులు తమ వంతు భాధ్యతగా పోలింగ్ లో పాల్గొని, జిల్లా యొక్క ఓటింగ్ శాతము పెంపొందించవలసిన ఆవశ్యకత గురించి వివరించినారు.