కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 22
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్,
ఎమ్మేల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్,సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ , ఆరేపల్లి మోహన్,కరీంనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ పురిమల్ల శ్రీనివాస్ ఇతర ముఖ్య నేతలుకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.