తూప్రాన్ లో హనుమాన్ జయంతి హనుమాన్ మాలాదరణ స్వాముల మధ్య విశేష పూజలతో ఉత్సవాలు .

ఇక్కడ పిలిస్తే పలికే కలియుగ దైవం.
సామూహిక సత్యనారాయణ వ్రతాలు
ఆలయ ప్రధాన అర్చకులు సలాక ఆత్రేయ శర్మ.

తూప్రాన్, ఎప్రిల్, 22 ప్రజాబలం న్యూస్ :-

ప్రకృతి రమ నీయమైన చెరువు నీళ్లు పక్కన పచ్చ తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయ మందిరం జయంతి ఉత్సవాలు హనుమాన్ మాలదరణ మండల దీక్ష స్వాముల మధ్య
తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయ.
రామనామ స్మరణతో జపము ప్రదక్షణ ఆలయ మందిరం రామనామ ఆంజనేయ స్మరణతో ప్రశాంత వాతావరణంలో రామనామ స్మరణతో మనసంతా రంజింప చేస్తుంది. ఆలయ అర్చకులు హనుమాన్ గురుస్వామి సలాక ఆత్రేయ శర్మ మాట్లాడుతూ

దశాబ్దాల జీవన సమరంలో అలసి సొలసిన వారికి అలంబన ఇచ్చే ఆధ్యాత్మిక క్షేత్రం అని ఇప్పటికీ కులమత బేధములు లేకుండా స్వామివ జయంతి ఉత్సవాలు ఆశేష భక్తుల మధ్య ఇక్కడ ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. జయంతి ఉత్సవం సందర్భంగా 21. 4. 2024 ఆదివారం క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ త్రయోదశి ఉదయం గణపతి పూజ పుణ్యం పుణ్యాహవాచనం అఖండ దీపారాధన అంకురార్పణము సుందరకాండ గురు చరిత్ర పారాయణంలో ప్రారంభము మన్యుసూక్త పాశు పతము, సీతారామ లక్ష్మణ విగ్రహాలకు అభిషేకం , తీర్థ ప్రసాద వితరణ
,22- 4- 2024 సోమవారం నాడు సంవత్సర చైత్ర శుద్ధి చతుర్దశి రోజున గణపతి నవగ్రహ రుద్ర పంచసూక్త మన్యుసూక్త లక్ష్మీ హోమంలూ, బిక్ష, ఇరుముడి మంగళహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ అన్న ప్రసాదం,
23- 04- 2024 మంగళవారం క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధి పౌర్ణమి హనుమాన్ జయంతి హనుమత్ మన్యు పాషూ పదం, సింధూరం, లక్ష పత్ర పూజ, లక్ష పుష్పార్చన , అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చన, శ్రీశ్రీశ్రీ యతివార మాధవానంద స్వామి వారి పాద పూజ, అనుగ్రహభాషన , ఉదయం 9 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు తీర్థప్రసాధన వితరణ అన్నదానం మాల విరమణ ఉంటుందని మీడియాతో మాట్లాడుతూ గురుస్వాములు ఆత్రేయ శర్మ, శేఖర్, గడ్డం ప్రశాంత్ కుమార్, మల్లికార్జున్ గౌడులు తెలిపారు. దంపతులందరూ కలియుగ దైవం సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకోగలరని సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకున్న వారికి సకల దోషములు తొలగిపోవునని సాధ్యమైనంతవరకు సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పించుకోగలరని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking