చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమం ని జయప్రదం చేయండి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
ప్రజాబలం శేరిలింగంపల్లి రాజేంద్ర నగర్ తహసీల్దార్ కార్యాలయం, 23.4.24 మంగళవారం రోజున ఉదయం 10.00గంటలకు
శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లకు ,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు,అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు,వార్డ్ మెంబర్లకు,ఏరియా కమిటీ ప్రతినిధులకు,ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు ,బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషులకు,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలియచేయునది ఏమనగా…
మన ప్రియతమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ రాజేంద్ర నగర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో రేపు అనగా 23.4.24 మంగళవారం రోజున ఉదయం 10.00గంటలకు నామినేషన్ వేయనున్నారు.*
కావున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అందరూ పాల్గొనాలని కోరారు.