మావోయిస్టు పోస్టర్లు విడుదల సమాచారం ఇచ్చినవారికి నగదు బహుమతి

రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఎం శ్రీనివాస్,డిసిపి అశోక్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : పోలీస్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్‌ అవిష్కరించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఐ పి ఎస్ ఎం శ్రీనివాస్. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఐ.పి.ఎస్,ఐజీ సిఎం శ్రీనివాస్ మంచిర్యాల డి సి పి అశోక్ కుమార్,ఐ పి స్,స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు,ఇతర అధికారులతో కలిసి ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దంటూ మావోయిస్టుల వివరాలతో పోస్టర్లు కరపత్రాలను విడుదల చేశారు.పోస్టర్లో ఉన్నవారి గురించి తెలిస్తే..తెలంగాణ పోలీసు కు సమాచారం ఇవ్వాలని సూచించారు. లేకపోతే..ఫోన్ నెంబర్లు : సి.పి.రామగుండం-08728 271333,డి.సి.పి.పెద్దపల్లి- 8712656502,డి.సి.పి. మంచిర్యాల-8712656503, ఎన్ ఒ బి 8712656596, నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల గురించి సమాచారం తెలియజేసిన వారికి పోస్టర్లలో ఉన్న విధంగా నగదు బహుమతి అందిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అదేవిదంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టు సోదరులు పోరాటం చేయాల్సింది అడవిలో కాదు అందరి మధ్య ప్రజా జీవనంలోకి వచ్చి ప్రజా సమస్యల పై చట్ట బద్దంగా పోరాడాలని ప్రజలచే ఎన్నుకోబడి చట్టసభల్లోకి ఎన్నికై పోలీసుల గౌరవ వందనం పొందాలి సీపీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking