జమ్మికుంటలో భారీ నగదు పట్టివేత.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 22.

లోక్ సభ ఎన్నికలలో భాగంగా సోమవారం రోజున జమ్మికుంట పట్టణ గ్రెన్ మార్కెట్ రోడ్డులో పట్టణ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఇట్టి వాహన తనిఖీలలో జమ్మికుంట మోత్కులగూడెం కు చెందిన పొనగంటి సురేష్ తండ్రి పేరు డాకయ్య అను వ్యక్తి వద్ద పదిహేను లక్షల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. ఇట్టి నగదును జమ్మికుంట సీఐ వరగంటి రవి హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు అప్పజెప్పారు. అనంతరం పట్టణ సీఐ మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికల నియమావళి ఉన్నందున.ఒక వ్యక్తి దగ్గర 50 వేల రూపాయల కంటే ఎక్కువ కలిగి ఉండరాదని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking