ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఐదు గ్యారెంటీలు అమలు చేశామని త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. దేశంలో మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమని అన్నారు