జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మే 13 వ జరుగనున్న పోలింగ్ రోజున జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్,సహాయ కార్మిక శాఖ కమిషనర్ విని వినీతలతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం మని,ఇలాంటి ఏడా లేకుండా ప్రతి ప్రతి ఒక్కరికి సమాన హక్కు కల్పించడం జరిగిందని తెలిపారు.దేశ అభివృద్ధికి పాటుపడే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు కల్పించడం జరిగిందని తెలిపారు.దేశభక్తి కి పాటు పాడే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోని అవకాశం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో జిల్లాలోని మంచిర్యాల,చెన్నూరు, బెల్లంపల్లి,అసెంబ్లీ సెగ్మెంట్లలలో మే 13 న జరగనున్న పోలింగ్ రోజున హర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుని,ఇందు కొరకు పోలింగ్ కేంద్రాల, త్రాగునీరు,నీడ,ఫ్యాన్లు, నిరంతరం విద్యుత్ సరఫరా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు.85 సంవత్సరాల వయసు పైబడిన వయే వృద్ధులు, పోలింగ్ కేంద్రాలకు రాలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు.ఈ నేపథ్యంలో 18 సంవత్సరాల వయసు నుండి ఓటర్ జాబితాలో వివరాలు నమోదు చేసుకున్న అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినిపించుకునే విధంగా ప్రసార,ప్రచార కార్యక్రమాలు, కళాజాత ఓటరు సెల్ఫీలు ఏర్పాటు చేయడం జరిగిందని,ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరు సెల్పీ దిగి వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా అర్హత గల వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె చిన్నయ్య,స్వీప్ సమన్వయకర్త రామచందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు