రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 23 ఏప్రిల్ 2024: హనుమాన్ జన్మదినోత్సవాల సందర్భముగా మంగళవారం 23 ఏప్రిల్ 2024 రోజున వీ ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు తరపున ప్రజలందరికీ శుభాభివందనములు తెలుపుతూ కార్యక్రమంలో భాగంగా మణికొండ సెక్రటేరియట్ కాలనీ లోనీ ప్రతిభా స్కూలు వద్ద గల చలివేంద్రం ప్రక్కన రచ్చా శ్రీనాథ్ ఆర్థిక సహకారముతో చల్లని చిక్కటి మజ్జిగతో పాటు రమ్యా శివల కూతురు అక్షర జన్య ఆర్థిక సహాయంతో హల్దిరామ్ కట్టా మీట ప్యాకెట్లు వితరణ గావించినామని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తూ ఇట్టి శుభ సందర్భంగా ట్రస్ట్ కొశాధికారి దిలీప్ కక్కడ్, సభ్యులు ఆలస్యం నవీన్ కుమార్, ఉపేందర్నాథ్ రెడ్డి, రచ్చా శ్రీనాథ్, సంఘ సేవకుడు శివరామకృష్ణ, మణికొండ ప్రజానీకం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించినారు.
