మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ తూప్రాన్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా భగవాన్ రెడ్డి నియామకం.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు తూప్రాన్ మండలం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా
భగవాన్ రెడ్డి ని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చరావాణి ద్వారా తెలిపారు. అనంతరం వంటెర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్తు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.