నా మీద నమ్మకంతో నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీయం గారికి కృతజ్ఞతలు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నా మీద నమ్మకంతో నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీయం గారికి కృతజ్ఞతలు. నన్ను ఆదరిస్తున్న నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు దన్యవాదాలు. సీయం కేసీఆర్ గారి ఆశీస్సులతో నిర్మల్ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతోంది. మూడవసారి అధికారంలోకి వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి భవిష్యత్ లో నిర్మల్ ను మరింత అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తున్నాను. ఇదే ఆదరాభిమానాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి గెలిపించాలని నిర్మల్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను.