జిల్లాలో ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాల్లో రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలి

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, డీఆర్వో హరిప్రియ

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 21:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాల్లో జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు తమ సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంంలో అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ముసాయిదా జాబితా ప్రచురణలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 21వ తేదీ (సోమవారం) నుంచి 2023 అక్టోబర్ 19వ తేదీ వరకు ప్రచురణలో భాగంగా ఏమైనా అభ్యంతరాలు, వాదనలు ఉన్నట్లయితే తెలపాలని వివరించారు. అలాగే ఈనెల 26, 27వ తేదీల్లో వచ్చే నెల (సెప్టెంబర్) 2, 3 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయా తేదీల్లో ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే వినియోగించుకోవాలని అనంతరం వాటిని సెప్టెంబర్ 28 ముగించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఎలక్ట్రోరల్ తుది జాబితాను అక్టోబర్ 04వ తేదీన ప్రచురించడం జరుగుతుందని వారు వివరించారు. ఈ విషయంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ సూచనలు, నిబంధనల మేరకు ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు చేయడంతో పాటు నూతనంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ నాయకులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking